Lawrence: ఎన్నో కష్టాలు పడ్డాను .. అసలు సంగతి ఆలస్యంగా అర్థమైంది: లారెన్స్
- 'రుద్రుడు' ప్రమోషన్స్ లో బిజీగా లారెన్స్
- ఈ నెల 14న విడుదలవుతున్న సినిమా
- కథానాయికగా అలరించనున్న ప్రియా భవాని శంకర్
- తను చేసే సాయాల వెనుక దేవుడున్నాడన్న లారెన్స్
లారెన్స్ హీరోగా చేసిన 'రుద్రుడు' ఈ నెల 14వ తేదీన విడుదలవుతోంది. దాంతో ఆయన ఇక్కడ కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. నా లైఫ్ లో నేను ఒక మూడింటిని ప్రాణంగా భావిస్తాను. ఆ మూడే అమ్మ .. మెడిటేషన్ .. డైరెక్షన్. ఇవి లేకుండా నేను ఉండలేను" అని అన్నారు.
"నా జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను .. అందువల్లనే ఎదుటివారి కష్టాలను వెంటనే అర్థం చేసుకోగలుగుతాను. గతంలో ఎవరికి ఎలాంటి సాయం చేస్తున్నా .. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నా, అవి నేనే చేస్తున్నానని అనుకునేవాడిని. ఇలాంటి పనులు చేయించడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడనే విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది" అని చెప్పారు.
'రుద్రుడు' విషయానికి వస్తే ఈ సినిమా కథ వినగానే, హీరోయిన్ గా ప్రియా భవానిశంకర్ అయితే బాగుంటుందని భావించాను. ఒకస్థాయి దాటే గ్లామరస్ రోల్స్ ఆమె చేయదు .. చాలా కండిషన్స్ పెడుతుంది. ఈ సినిమాలో రోల్ చేయడానికి వెంటనే ఆమె ఓకే చెప్పేసింది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.