Whatsapp: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- సెట్టింగ్స్ లోనూ సెర్చ్ ఆప్షన్ తీసుకువస్తున్న వాట్సాప్
- సెట్టింగ్స్ సెక్షన్ లో ఓ సెర్చ్ బార్ ఏర్పాటు
- ప్రస్తుతానికి బీటా వర్షెన్ విడుదల
ప్రముఖ సోషల్ మెసేజింగ్ సైట్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఇకపై వాట్సాప్ సెట్టింగ్స్ లోనూ ఓ సెర్చ్ బార్ కనిపించనుంది. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలో ఉంది. ప్రస్తుతం ఈ సెర్చ్ బార్ బీటా వెర్షన్ కొందరు పరిశీలకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దీన్ని అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ సెర్చ్ బార్ సాయంతో సెట్టింగ్స్ విభాగంలోనూ మనకు కావాల్సిన అంశాన్ని నేరుగా వెదికే వీలుంటుంది. బీటా వెర్షన్ లో ఈ సెర్చ్ బార్ కు సంబంధించిన ఐకాన్ దర్శనమిస్తోంది. ఈ ఐకాన్ ఉంటే సెట్టింగ్స్ లోనూ సెర్చ్ చేయొచ్చు.
కాగా, ఒకే వాట్సాప్ అకౌంట్ ను రెండు మూడు స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించుకునే ఫీచర్ పైనా వాట్సాప్ టెక్ టీమ్ కసరత్తులు చేస్తోంది. దీన్ని కంపానియన్ మోడ్ గా పిలుస్తున్నారు.
ప్రధాన డివైస్ లో ఉండే వాట్సాప్ అకౌంట్ ను ఒకటి కంటే ఎక్కువ డివైస్ లనూ యాక్సెస్ చేసేందుకు ఈ కంపానియన్ మోడ్ ఉపకరిస్తుంది. దీని ద్వారా రెండు డివైస్ లలోనూ వాట్సాప్ అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రధాన డివైస్ ఆఫ్ లైన్ లో ఉన్నా, స్విచాఫ్ అయినా... యూజర్లు నోటిఫికేషన్లు పొందే వీలుంటుంది.