Samantha Ruth Prabhu: ‘శాకుంతలం’ కోసం పొట్ట తగ్గించుకున్న సమంత

Samantha Ruth Prabhu was told to lose her abs for Shaakuntalam They wouldnt be suitable
  • శకుంతల పాత్రకు అనుగుణంగా ఆకృతి లేదన్న డైరెక్టర్ గుణశేఖర్
  • సాధనతో పొట్ట భాగంలో కండను కరిగించుకున్న సమంత
  • మొదటి నుంచీ ఈ పాత్రకు సమంతనే అనుకున్నట్టు వెల్లడి
సమంత నటించిన ‘శాకుంతలం’సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. శకుంతల పాత్రను సమంత పోషించింది. ఈ పాత్ర కోసం ఆమె కొంత సాధన చేయాల్సి వచ్చిందని డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదలైంది.

రాజు దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమే ఈ సినిమా కథనం. దేవ్ మోహన్ ఇందులో దుష్యంత్ పాత్రను పోషించాడు. కథనాయికగా శకుంతల పాత్ర విషయంలో సమంత తప్పించి మరో చాయిస్ తమకు లేదని గుణశేఖర్ తెలిపారు. ‘‘శామ్ మొదట కథ గురించి చెప్పినప్పుడు నో అనలేదు. అనారోగ్యం కారణంగా కొంత వ్యవధి కావాలని అడిగింది. సినిమా ఎలా ఉంటుందనే దానికి కొంత మెటీరియల్ ను ఆమెకు చూపించాను. 

తన శరీర ఆకృతి విషయంలో కొంత సాధన చేయాలని ఆమెను కోరాను. పొట్ట భాగంలో కండరాలు ఆమె పాత్రకు అనుకూలంగా సున్నితంగా లేవని చెప్పాను’’ అని గుణశేఖర్ వివరించారు. ఈ పాత్రకు సంబంధించి మొదటి రోజు నుంచి కూడా సమంతే తమ దృష్టిలో ఉందని, మరో నటిని అనుకోలేదని స్పష్టం చేశారు. మొదటి రోజు ఈ సినిమా రూ.5 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల కథనం. 
Samantha Ruth Prabhu
Shaakuntalam
lose
abs
director
gunasekhar

More Telugu News