Rashmika Mandanna: అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిన రష్మిక

Allu Arjun stood in 3rd place in IMDB rankings

  • ఐఎండీబీ ర్యాంకుల్లో మూడో స్థానంలో రష్మిక
  • 17వ స్థానంలో నిలిచిన అల్లు అర్జున్
  • 49వ స్థానంలో నాని

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో సైతం బిజీ అవుతున్న రష్మిక మందన్న మరో ఘనతను సొంతం చేసుకుంది. సినిమాలను విశ్లేషిస్తూ ర్యాంకులు ఇచ్చే ఐఎండీబీ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ఈ జాబితాలో రష్మిక తొలిసారి టాప్ 3 స్థానంలో నిలిచింది. ఇటీవలే 'పుష్ప2' గ్లింప్స్ రావడం, ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ కారణంగా ఆమె గురించి ఇంటర్నెట్ వేదికగా చాలా మంది మాట్లాడుకున్నారు. దీంతో ఆమె ర్యాంకింగ్ భారీగా పెరిగింది. 

మరోవైపు ఈ జాబితాలో అల్లు అర్జున్ 17వ స్థానంలో నిలిచాడు. తమన్నా 33వ స్థానంలో, నాని 49వ స్థానంలో, కీర్తి సురేశ్ 50వ స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News