Andhra Pradesh: ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక పాలసీ తెచ్చిన ఆంధ్రప్రదేశ్​

Andhra Pradesh brought  special policy for transgenders

  • హిజ్రాలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
  • వారికి గుర్తింపు కార్డులను జారీ చేయనున్న సర్కారు
  • సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్ లో రూ. 2 కోట్లు కేటాయింపు

ట్రాన్స్ జెండర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోసం ట్రాన్స్ జెండర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లకు మంచి వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. వారికి సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయనుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను జారీ చేయనుంది. వారి కోసం ప్రస్తుత బడ్జెట్ లో రూ. 2 కోట్లు కేటాయించింది. నవరత్నాల ద్వారా హిజ్రాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. వారికి ప్రత్యేకంగా మరికొన్ని చర్యలు చేపట్టింది. వాళ్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.

  • Loading...

More Telugu News