Mumbai Indians: లక్ష్యాన్ని ఊదిపడేశారు... ముంబయి ఇండియన్స్ ఈజీ విన్

Mumbai Indians easy win against KKR

  • ఐపీఎల్ తాజా సీజన్ లో రెండో విజయం సాధించిన ముంబయి
  • నేడు కోల్ కతాపై 5 వికెట్ల తేడాతో విజయం
  • 186 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఛేదించిన ముంబయి ఇండియన్స్
  • విజృంభించిన ఇషాన్ కిషన్
  • రాణించిన సూర్యకుమార్, తిలక్ వర్మ, రోహిత్, టిమ్ డేవిడ్

ఐపీఎల్ తాజా సీజన్ లో కాస్త లేటుగా ఫామ్ లోకి వచ్చిన ముంబయి ఇండియన్స్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని 14 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. 

యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 58 పరుగులు చేయడం విశేషం. 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన కిషన్ ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ కు సరైన ఊపునిచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 20 పరుగులు చేశాడు. 

తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి రావడం ముంబయి ఇండియన్స్ శిబిరాన్ని సంతోషానికి గురిచేసింది. సూర్య ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

ఇక, తెలుగుతేజం తిలక్ వర్మ తన ఫామ్ ను ఈ మ్యాచ్ లోనూ కంటిన్యూ చేశాడు. 25 బంతులాడిన తిలక్ వర్మ 3 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ 2, శార్దూల్ ఠాకూర్ 1, వరుణ్ చక్రవర్తి 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (104) సెంచరీ సాధించడం కోల్ కతా ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది.

ఐపీఎల్ డబుల్ హెడర్... గుజరాత్ టైటాన్స్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ కాగా, నేటి రెండో మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.


  • Loading...

More Telugu News