sneeze: ఉదయం నిద్ర లేవగానే తుమ్ములు వస్తుంటాయి ఎందుకు?

Why do most people sneeze when they wake up in the morning

  • వాయు కాలుష్యాల వల్లే వరుస తుమ్ములు
  • దీన్నే వైద్య పరిభాషలో అలెర్జిక్ రైనైటిస్ గా పిలుస్తారు
  • కాలుష్యాలకు దూరంగా ఉండడమే మెరుగైన పరిష్కారం

ఉదయం నిద్ర లేచిన తర్వాత కొందరు అదేపనిగా తుమ్మడం చూస్తూనేవుంటాం. కొందరికి ఒకటి రెండు తుమ్ములు వచ్చి ఆగిపోతాయి. కొందరిలో అయితే వరుసపెట్టి చాలా తుమ్ములు వస్తుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. వైద్యుల వద్దకు ఈ తరహా సమస్యలతో వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. దీనికి పలు కారణాలను ముంబైలోని భాటియా హాస్పిటల్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అనామికా రాథోడ్ తెలియజేస్తున్నారు.

మనం నిద్రించే సమయంలో డస్ట్ పురుగులు, వాయు కాలుష్య కారకాలు, బెడ్ కవర్ల నుంచి వెలువడే ఫైబర్, ఫంగల్ స్పోర్లు, చిన్న సూక్ష్మ జీవులు, బొద్దింకలు ఇలా ఎన్నో వాటికి ప్రభావితమవుతుంటాం. రాత్రి సమయంలో వీటి ప్రభావానికి గురి కావడం వల్ల ముక్కు నాసికా రంధ్రాల్లో ఇన్ ఫ్లమ్మేషన్ ఏర్పడుతుంది. నిద్ర లేచిన తర్వాత వీటిని బయటకు పంపించేందుకు మన శరీరం తుమ్ములు వచ్చేలా చేస్తుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ. 

అలాగే, ఉదయం వాతావరణంలోనూ పొల్యూటెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి ప్రభావానికి గురి కావడం ఆ సమయంలో తుమ్ములు రావడానికి మరో కారణం. తుమ్ములు వస్తున్నాయంటే ముక్కు శుభ్రం చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో అలెర్జిక్ రైనైటిస్ అంటారు. వాయు కాలుష్యాలు, ఫంగల్ స్పోర్లు, డస్ట్ మైట్స్ అలెర్జిక్ రైనైటిక్ కు కారణం అవుతాయి. 

వాతావరణంలో మార్పులు కూడా ఇందుకు కారణం కావచ్చు. రాత్రంతా సౌకర్యవంతమైన వాతావరణంలో నిద్రించిన తర్వాత లేచి, వేడి వాతావరణంలోకి వెళ్లినప్పుడు కూడా శరీరం తుమ్ముల రూపంలో స్పందన తెలియజేస్తుంది. ఏసీ గదుల్లో నిద్రించే వారికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఉన్నట్టుండి మరీ చల్లటి వాతావరణం, చల్లటి వస్తువుల జోలికి వెళ్లొద్దు. పడక దుప్పట్లు, బెడ్ షీట్లు, పిల్లో కవర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. తమకు సరిపడని పనులు, పదార్థాలకు దూరంగా ఉండాలి.

  • Loading...

More Telugu News