Hyderabad: ఉక్కపోత నుండి కాస్త విరామం.. హైదరాబాద్లో పలుచోట్ల వడగళ్ల వాన
- హైకోర్టు ప్రాంతంలో వడగళ్ల వర్షం
- మెట్రో కింద తలదాచుకున్న జనాలు
- కొన్నిచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం
భాగ్యనగర ప్రజలకు ఉక్కపోత నుండి కాస్త విరామం ఇచ్చాడు వరుణుడు. వారం పది రోజుల్లో రెండోసారి నగరం వర్షంతో తడిసిపోయింది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, కోఠి, గోషామహల్, బేగంబజార్, హైకోర్టు, బహదూర్ పుర తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. అబిడ్స్, హిమయత్ నగర్, లిబర్టీ, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోను వర్షం పడింది.
దుకాణాలు, ఆఫీస్ ల నుండి బయటకు వెళ్లిన వాహనదారులు, పాదచారులు తడిసిముద్దయ్యారు. చాలామంది వర్షం తగ్గిపోయే వరకు మెట్రో కింద తలదాచుకున్నారు. కొన్నిచోట్ల నీరు నిల్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి ఉక్కపోత, సాయంత్రానికి వడగళ్ల వాన అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.