elephant: ఏనుగులు డ్యాన్స్ కూడా చేస్తాయా..!
- ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో డ్యాన్స్ చేస్తున్న ఏనుగు
- తన ఎదుట స్టెప్స్ చేస్తున్న యువతిని అనుసరిస్తున్న గజరాజు
- ఇలాంటివి చేయొద్దంటూ నెటిజన్ల సూచనలు
ఏనుగులు మనుషులతో స్నేహంగానే ఉంటాయని చెప్పేందుకు ఇంటర్నెట్ లో ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. వాటిని ఏమీ అనకుండా ఉంటే ఫర్వాలేదు. కానీ, వాటి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం అవి భరతం పట్టేందుకు వెనుకాడవు. ఏనుగులు డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా..? కంటెంట్ క్రియేటర్ అయిన వైష్ణవి నాయక్ కట్టేసి ఉన్న ఏనుగు ముందు స్టేప్స్ వేస్తుంటే.. ఏనుగు అచ్చం వాటిని ఫాలో అవుతుండడాన్ని గమనించొచ్చు. ఈ వీడియో క్లిప్ ను వైష్ణవి నాయక్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి ఇప్పటికే 9.63 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. (వీడియో కోసం)
ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో తీసిన వీడియో ఇది. దీనిపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి భిన్నమైన స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభినందిస్తుంటే, కొందరు ఇలాంటివి చేయడం ఆపివేయాలని సూచిస్తున్నారు. ఏనుగులు గొలుసులతో బంధించినప్పుడు ఇలా చేయడం సహజమేనని ఓ యూజర్ కామెంట్ చేశాడు. వాటి ఫీలింగ్స్ తో ఫన్ చేయకండని కోరాడు. ఇది క్యూట్ వీడియో అని అంటూ, ఏనుగులను వేధించడాన్సి సమర్థించొద్దని మరో వ్యక్తి కోరాడు.