shaakuntalam: పని చేయి.. ఫలితం ఆశించకు.. ‘శాకుంతలం’పై సమంత వేదాంతం!
- బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన శాకుంతలం సినిమా
- ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టిన సమంత
- ఫలితం మన చేతుల్లో ఉండదనే అర్థం వచ్చేలా భగవద్గీత శ్లోకం ప్రస్తావన
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘శాకుంతలం’ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షుకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంత.. సినిమా ఫ్లాప్ కావడంతో వేదాంతం వల్లిస్తోంది.
ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది సమంత. ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మాణి’ అని రాసుకొచ్చింది. భగవద్గీతలోని శ్లోకమిది. ‘‘నీకు పని చెయ్యడం మీదే హక్కు ఉంది. దాని ఫలితం మీద ఏ మాత్రం ఉండదు. ఫలితానికి ప్రేరేమితమై పని చేయకూడదు. అలాగని పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి’’ అని దీని అర్థం. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
శాకుంతలంలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఆయన ప్రీమియర్ షోలు వేయించి సినిమాను ప్రమోట్ చేసినా.. ఫలితం మాత్రం మారలేదు.
సమంత చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా చేస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. మరో సినిమా సిటాడెల్. ఇది హాలీవుడ్ ‘సిటాడెల్’కు ఇండియన్ వర్షన్.