Raghuveera Reddy: బెంగళూరు సిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీగా రఘువీరారెడ్డి?
- చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా రఘువీరా
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలను అప్పగించిన హైకమాండ్
- రాహుల్ పై అనర్హత వేటు విషయంలో రఘువీరా ఆవేదన
మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎలెక్షన్స్ నేపథ్యంలో బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్ఛార్జీగా రఘువీరారెడ్డిని హైకమాండ్ నియమించినట్టు సమాచారం.
ఇతరులకు వర్తించని నిబంధనలు రాహుల్ కు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఆయనను బంగ్లా కూడా ఖాళీ చేయించారని... ఈ బాధను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు.