Manchester: యూకేలో చీరకట్టుతో మారథాన్ లో పరుగు!

Indian origin woman runs Manchester marathon wearing a sari

  • మాంచెస్టర్ మారథాన్ లో ఒడిశా మహిళ సందడి
  • దాదాపు 5 గంటల్లో మారథాన్ పూర్తిచేసిన మధుస్మిత
  • చీరకట్టుతో పరుగెత్తలేరనే అపోహను తొలగించేందుకేనని వెల్లడి

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో జరిగిన మారథాన్ లో చీరకట్టులో పరుగులు తీసి అందరినీ ఆకర్షించిందో మహిళ.. మిగతావారితో పాటూ 42.5 కిలోమీటర్ల దూరాన్ని ఆవిడ దాదాపు 5 గంటల్లో పూర్తిచేశారు. చీర కట్టుకుని పరుగులు పెట్టడం సాధ్యంకాదనే అపోహను దూరంచేశారు. ఉద్యోగరీత్యా మాంచెస్టర్ లో ఉంటున్న ఆ మహిళ పేరు మధుస్మిత జెనా.. సొంతూరు ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలోని కుసుపూర్ గ్రామం.

మాంచెస్టర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మధుస్మిత గతంలోనూ పలు మారథాన్ లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కిందటి ఆదివారం మాంచెస్టర్ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ లో పాల్గొన్న మధుస్మిత.. తొలిసారి చీరకట్టుతో పరుగెత్తారు. మొత్తం 42.5 కిలోమీటర్ల పరుగును 4.50 గంటలలో మధుస్మిత పూర్తిచేశారు. రోజూ చీరలో కనిపించే అమ్మ, నానమ్మ స్ఫూర్తితో, చీరకట్టుతో మహిళలు పరుగెత్తలేరనే అపోహను తొలగించేందుకు ఈ పోటీలో పాల్గొన్నానని మధుస్మిత తెలిపారు.

  • Loading...

More Telugu News