Gali Janardhan Reddy: సుప్రీంకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఎదురుదెబ్బ

Supreme court rejects Gali Janardhan Reddy petition

  • బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంలో జనార్దన్ రెడ్డి పిటిషన్
  • బెయిల్ షరతులను సడలించాలని విన్నపం
  • గాలి విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంతంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ పోటీ చేస్తోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. అయితే బళ్లారికి వెళ్లకూడదనే బెయిల్ షరతు ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో తన బెయిల్ షరతులను సడలించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంను ఆయన కోరారు. 

ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనలను సడలించడం కుదరదని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్ లో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జైలు జీవితాన్ని గడిపిన జనార్దన్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News