Raj Nath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా
- హోం ఐసోలేషన్లో రాజ్నాథ్ సింగ్
- మంత్రిని పరీక్షించిన వైద్యుల బృందం
- రాజ్నాథ్ సింగ్లో ఓ మాదిరి రోగ లక్షణాలు
- విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన
దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తాజాగా తేలింది. ప్రస్తుతం మంత్రి హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆయనకు ఓ మాదిరి రోగ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్నాథ్ సింగ్ను పరీక్షించిన వైద్యం బృందం విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. మంత్రి కరోనా బారిన పడ్డ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొనరని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.