Bandaru: అవినాశ్ చేస్తున్న ప్రయత్నాలు వేస్ట్.. అరెస్ట్ తప్పదు: బండారు
- వివేకా హత్య కేసులో అవినాశ్ అరెస్ట్ కావడం ఖాయమన్న బండారు
- నేర స్థలంలో ఆధారాలు చెరిపేయకూడదనే విషయం తెలియదా అని ప్రశ్న
- రక్తాన్ని కడిగింది ఎవరో సజ్జల చెప్పాలని డిమాండ్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అవినాశ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథానే అని అన్నారు. నేరం జరిగిన స్థలంలో ఆధారాలను చెరపకూడదనే విషయం అవినాశ్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. హత్య జరిగిన స్థలానికి పోలీసులు రాకముందే ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేశారని అన్నారు.