Tamil Nadu: బస్సులో వెళ్తున్న యువకుడిని కిందికి దించి లైంగిక దాడి.. ఆరుగురి అరెస్ట్

Software engineer molested by six persons in Tamil Nadu

  • తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘటన
  • లైంగికదాడి దృశ్యాలను వీడియో తీసి బెదిరింపు
  • రూ. 75 వేలు సమర్పించుకున్న బాధితుడు

తమిళనాడులో దారుణం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న యువకుడిని కిందికి దించిన కొందరు వ్యక్తులు అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసి బెదిరించి సొమ్ము చేసుకున్నారు. నిందితులు ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఐటీ ఉద్యోగి. బస్సులో పుత్తానందం నుంచి మణప్పారైకు వెళ్తున్నాడు. వండిపేట్టైకి చెందిన అరివళగన్ (27) కూడా అదే బస్సులో ప్రయాణిస్తున్నాడు. 

ఈ క్రమంలో తన స్నేహితులకు ఫోన్ చేసిన అరివళగన్.. బస్సులో తనతోపాటు ప్రయాణిస్తున్న యువకుడు గొడవపడ్డాడని, మణప్పారై వద్ద ఉన్న కొలను వద్దకు రావాలని చెప్పాడు. బస్సు అక్కడికి చేరుకున్నాక అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న స్నేహితులు ఐదుగురితో కలిసి ఐటీ ఉద్యోగిని బలవంతంగా బస్సు నుంచి కిందికి దించారు. అనంతరం పక్కనే ఉన్న కొలను వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ సేతురత్నాపురానికి చెందిన రియాజ్ (24) బాధితుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మిగతా వారు ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆపై బెదిరించి రూ. 75 వేలు డిమాండ్ చేశారు. మరో గత్యంతరం లేక బాధితుడు వారు డిమాండ్ చేసిన మొత్తం సమర్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రియాజ్, అరివళగన్, అరుణ్‌కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్ కుమార్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. కాగా, నిందితుల్లో రియాజ్, సెంథిల్ కుమార్ గతంలో ఓ విద్యార్థినిపైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలింది.

  • Loading...

More Telugu News