Raw: నట్స్ ను వేయించుకుని తినాలా? లేక నానబెట్టుకుని తీసుకోవాలా..?

Raw vs roasted vs soaked nuts Which is healthier

  • నట్స్ ముడి రూపంలో తీసుకుంటే పోషకాల నష్టం ఉండదు
  • కానీ ముడి నట్స్ లో హానికారక బ్యాక్టీరియా
  • శుభ్రంగా కడుక్కుని తీసుకోవచ్చు
  • ఓవెన్ లేదా ఫ్రయర్ లో వేయించుకుని తినొచ్చు

పోషకాలకు చిరునామా నట్స్. బాదం, వాల్ నట్, జీడిపప్పు, వేరు శనగ ఇవన్నీ కూడా మంచి ప్రొటీన్ తో కూడినవి. ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిల్లో ఉంటాయి. పైగా కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని మోస్తరుగా తినడం వల్ల బ్లడ్ షుగర్ పై ఎలాంటి ప్రభావం పడదు. నట్స్ లో మెగ్నీషియం, సిలీనియం, ఫాస్ఫరస్, విటమన్ ఈ ఉంటాయి. ముఖ్యంగా నట్స్ లో పాలీ అన్ శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మార్కెట్లో రా నట్స్ తోపాటు, రోస్టెడ్ (వేయించిన) నట్స్ ను కూడా విక్రయిస్తున్నారు. వైద్యులు నానబెట్టి తినాలని సూచిస్తుంటారు. మరి ఎలా తీసుకోవాలి? అన్న సందేహం రావచ్చు.

నట్స్ ను వేయించడం వల్ల వాటి ఫ్లావర్ లో మార్పు వస్తుంది. మంచి వాసన, రుచి తోడవుతుంది. వాటిల్లో తేమ తగ్గిపోయి కరకరలాడతాయి. ముడి నట్స్ తో పోలిస్తే కొంచెం తేలిగ్గా జీర్ణమవుతాయి. అయితే, బరువు తగ్గాలని కోరుకునే వారు నట్స్ ను వేయించుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నట్స్ ను వేయించేందుకు కొంత నెయ్యి, నూనె వాడాల్సి వస్తుంది. అది బరువు పెరిగేందుకు కారణమవుతుంది. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు నట్స్ ను నానబెట్టి తీసుకోవడం మంచిది. లేదంటే మైక్రోవేవ్ ఓవెన్ లో రోస్ట్ చేసుకుని తీసుకోవచ్చు.

ముడి నట్స్, వేయించిన నట్స్ లో పోషకాల పరంగా పెద్ద మార్పు ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు వేడి కారణంగా కొంత తగ్గుతాయి. ముడి నట్స్ తో పోలిస్తే వేయించిన వాటి షెల్ఫ్ లైఫ్ (నిల్వ ఉండే కాలం) తగ్గుతుంది. రా నట్స్ లో హానికారక సాల్మోనెల్లా, ఈ కొలీ బ్యాక్టీరియాలు ఉంటుంటాయి. ఎందుకంటే  సాగు సమయంలో భూమిపై పడుతుంటాయి. దాంతో మట్టిలోని బ్యాక్టీరియాతో కలుషితం అవుతుంటాయి. అలాగే కలుషిత నీటిలో పెరిగిన వాటిల్లోనూ బ్యాక్టీరియా ఉండొచ్చు. ఆల్మండ్స్, వాల్ నట్, పిస్తాలో సాల్మోనెల్లా ఎక్కువగా కనిపిస్తుంది. 

నట్స్ ను బాగా వాష్ చేసి, మైక్రోవేవ్ ఓవెన్ లో లేదంటే సన్నని మంటపై ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుని తినొచ్చు. లేదా ఫ్రయర్ లోనూ వేయించుకోవచ్చు. నట్స్ కు ఉప్పును యాడ్ చేసుకుని తినడం మంచిది కాదు. నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. దీనివల్ల జీర్ణపరమైన సమస్యలు ఎదురుకావు. ముడి నట్స్ నే తీసుకునేట్టు అయితే, వాటిపై బ్యాక్టీరియా పోయేందుకు శుభ్రంగా కడుక్కోవాలి.

  • Loading...

More Telugu News