Jawahar: మంత్రి ఆదిమూలపు సురేశ్ కు పలు ప్రశ్నలను సంధించిన జవహర్

Jawahar questions to Minister Adimulapu Suresh
  • దళిత జాతికి సురేశ్ తలవంపులు తెస్తున్నారన్న జవహర్
  • దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా సురేశ్ కు లేదని వ్యాఖ్య
  • దళిత బాంధవుడు చంద్రబాబును అనే అర్హత సురేశ్ కు లేదని మండిపాటు
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఆదిమూలపు సురేశ్ దళిత జాతికి తలవంపులు తెస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే సాటి దళితుడిగా ఏనాడూ స్పందించలేదని దుయ్యబట్టారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా సురేశ్ కు లేదని అన్నారు. దళిత బాంధవుడైన చంద్రబాబును అనే అర్హత సురేశ్ కు లేదని అన్నారు. ఇదే సమయంలో మంత్రికి జవహర్ పలు ప్రశ్నలను సంధించారు. 

సురేశ్ కు జవహర్ సంధించిన ప్రశ్నలు:
  • వరప్రసాద్ కు శిరోముండనం చేసినప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నారు?
  • దుర్గి, నెల్లూరు లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం అయినప్పుడు ఎక్కడున్నారు?
  • ముందడుగు, మలుపు పథకాలు కనుమరుగు అయినప్పుడు ఏమయ్యారు?
  • మీ నియోజక వర్గంలోని దళితులకు మీరు ఏం చేశారు?
  • డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం మరణాలు మీకు కనిపించలేదా?
Jawahar
Chandrababu
Telugudesam
Adimulapu Suresh
YSRCP

More Telugu News