Chandrababu: రాళ్ల దాడి ఘటనపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

Chandrababu hold teleconference with keyleaders following attack on his road show in prakasam district

  • ఈ రోజు ఉదయం ముఖ్యనేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్
  • రాళ్ల దాడి ఘటనను గవర్నర్ దృష్టకి తీసుకెళ్లాలని నిర్ణయం
  • తొలుత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్న టీడీపీ 
  • కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే యోచనలో బాబు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం చంద్రబాబు రోడ్ షో పై వైసీపీ రాళ్ల దాడికి దిగిందంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఉదయం పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనను రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ ఈ దాడి వివరాలను రాజభవన్‌కు ఈమెయిల్ చేసింది. 

వైసీపీ తీరుపై కేంద్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. స్థానిక నేతలు ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి వెలుగులోకి తీసుకురావాలని కూడా చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News