digestive issues: ఇలా చేస్తే.. జీర్ణక్రియకు తిరుగుండదు!

Struggling with digestive issues Try these simple morning habits for healthier gut

  • నానబెట్టిన బాదం గింజలను రోజూ ఉదయం తినాలి
  • పొద్దున్నే నిమ్మరసం కలిపిన నీరు తాగాలి
  • స్ట్రెచింగ్ వ్యాయామాలతోనూ మంచి ఫలితాలు

నేడు మారిన జీవనశైలి వల్ల ఎంతో మంది జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. మన జీర్ణ వ్యవస్థ శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలను సంగ్రహిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. నోటి నుంచి పేగుల వరకు ఈ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలతో తిన్నది వంటికి కూడా పట్టదు. బరువు తగ్గుతారు. ఈ సమస్యల నుంచి బయట పడేందుకు, జీర్ణశక్తిని పెంచుకునే ఉపాయాలు ఉన్నాయి.

బాదం గింజలు
బాదం గింజల్లో మంచి పోషకాలు ఉంటాయని తెలిసిందే. విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ప్రొటీన్, ముఖ్యమైన కెమికల్స్, ఫ్లావనాయిడ్, మినరల్స్ ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ కు కారణమవుతుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో గుండె కు కూడా రక్షణ ఏర్పడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రిషన్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఫలితాల ప్రకారం.. ప్రతి రోజూ బాదం తినడం వల్ల బ్యుటిరేట్ సింథసిస్ ప్రక్రియ మెరుగుపడుతుందని తెలిసింది. ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. దీనివల్ల పేగుల ఆరోగ్యం బలపడుతుంది. పైగా బాదంలో ఉండే ఫైబర్ కూడా జీర్ణవ్యవస్థకు మంచి చేస్తుంది.

నిమ్మరసం కలిపిన నీరు
మనలో ఎక్కువ మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ దీనికి బదులు నిమ్మరసం కలిపిన నీరు తాగి చూడండి. ఇది జీర్ణ వ్యవస్థకు ప్రేరణనిస్తుంది. కడుపుబ్బరం, కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే నిమ్మరసం కడుపులోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. నిమ్మలో ఉండే అసిడిటీ జీర్ణ రసాలను ఉత్పత్తయ్యేలా చేస్తుంది. దీంతో తీసుకున్న ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది.

వ్యాయామం
ఉదయం వేళ వ్యాయామం మరో ముఖ్యమైన అంశం. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. యోగా చేసుకోవచ్చు. రక్త ప్రసరణ పెరిగేలా వేగంగా నడవడం, ఏరోబిక్ వ్యాయామాలు, లేదంటే కాళ్లూ, చేతులను కదిలించేవి అయినా చేసుకోవచ్చు. దీనివల్ల కూడా జీర్ణశక్తి బలపడుతుంది. ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకుని నోటి ద్వారా విడుదల చేసేదీ అనుసరించొచ్చు.

  • Loading...

More Telugu News