Sanjay Singh: సీన్ రివర్స్... ఈడీ అధికారులకు నోటీసులు పంపిన ఆప్ ఎంపీ

AAP MP issues legal notice to ED officials

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ
  • ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పై ఆరోపణలు
  • ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్న సంజయ్ సింగ్
  • 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఈడీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లకు హెచ్చరిక

సాధారణంగా ఏవైనా కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు పంపడం తెలిసిందే. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇద్దరు ఈడీ అధికారులకు నోటీసులు పంపారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని సంజయ్ సింగ్ సదరు ఈడీ అధికారులపై మండిపడ్డారు. ఆ మేరకు ఈడీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ లకు ఆయన లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆప్ రాజ్యసభ సభ్యుడు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News