Dharma Varapu Subrahmanyam: ఇక డైరెక్షన్ జోలికి వెళ్లొద్దని నాన్న అప్పుడే అనుకున్నారు: ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు

Ravi Brahma Interview

  • స్టార్ కమెడియన్ గా వెలిగిన ధర్మవరపు 
  • ఆయనకి నాటకాలంటే ఇష్టమన్న తనయుడు 
  • 'తోకలేని పిట్ట' ఫ్లాప్ అయిందని వెల్లడి 
  • ఆ తరువాత డైరెక్షన్ జోలికి వెళ్లలేదని వ్యాఖ్య

నాటక రంగం నుంచి బుల్లితెరకు .. బుల్లితెర నుంచి సినిమా రంగానికి వెళ్లి సక్సెస్ అయినవారి జాబితాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా కనిపిస్తారు. ఆయన గురించిన విషయాలను ఆయన తనయుడు రవి బ్రహ్మ ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'అద్దంకి' దగ్గరలోని ఒక పల్లెటూళ్లో నాన్నగారు పుట్టి పెరిగారు. మొదటి నుంచి ఆయనకి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది" అన్నారు. 

"దూరదర్శన్ లో ఆయన చేసిన 'ఆనందో బ్రహ్మ'కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  అప్పుడే ఆయన యాక్టింగ్ నచ్చడంతో జంధ్యాల గారు తన సినిమాలో అవకాశం ఇచ్చారు.  ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు" అని చెప్పారు. 

"ఆ తరువాత కాలంలో 'తోకలేని పిట్ట' అనే ఒక సినిమాకి తానే దర్శకుడిగా వ్యవహరించారు. ఆ సినిమా ఆయనను బాగా నిరాశపరిచింది. దాంతో యన ఇక డైరెక్షన్ జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చేశారు. అలాగే నిర్మాతగా మారే ప్రయత్నం కూడా చేయలేదు. తనకి తెలిసింది నటన .. ఆ ట్రాక్ లో ముందుకు వెళ్లడమే మంచిదనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్లారు" అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News