Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 401 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • రెండున్నర శాతానికి పైగా పుంజుకున్న విప్రో షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీలు గత వారంలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లోనే ఉన్న మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 401 పాయింట్లు లాభపడి 60,056కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,743 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (2.69%), టైటాన్ (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.31%), యాక్సిస్ బ్యాంక్ (2.16%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.14%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.24%), మారుతి (-1.11%), సన్ ఫార్మా (-1.00%), భారతి ఎయిర్ టెల్ (-0.63%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.42%).

  • Loading...

More Telugu News