YS Sharmila: గాంధీ ఆసుపత్రిలో షర్మిలకు వైద్య పరీక్షలు.. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు షర్మిల

YS Sharmila to be presented in Napally court

  • పోలీసులపై చేయిచేసుకున్న కేసు
  • నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • షర్మిలకు జడ్జి రిమాండ్ విధించే అవకాశం

ఎస్సై, ఒక మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న ఘటనలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం తన నివాసం నుంచి సిట్ కార్యాలయానికి ఆమె వెళ్తున్నప్పుడు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దాడి చేశారు. దీంతో ఆమెపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 332, 353, 509, 427 కింద కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఆమెను కాసేపట్లో పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెడతారు. మరోవైపు, నాంపల్లి కోర్టు వద్దకు వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకుంటుండటంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకోవైపు షర్మిలకు జడ్జి రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇదిలావుంచితే, కాసేపటి క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తన భార్యను బ్రదర్ అనిల్ కుమార్ పరామర్శించారు.

  • Loading...

More Telugu News