Gopichand: 'రామబాణం' నుంచి హుషారైన బీట్ రిలీజ్!
- శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన 'రామబాణం'
- గోపీచంద్ కాంబినేషన్లో ఆలయానికి ఇది మూడో సినిమా
- కథానాయికగా అందాల సందడి చేయనున్న డింపుల్
- సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్
- మే 5వ తేదీన సినిమా విడుదల
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'రామ బాణం' సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, గోపీచంద్ జోడీగా డింపుల్ హయతి కనువిందు చేయనుంది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'నువ్వే నువ్వే' అంటూ సాగే ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'మొదటిసారిగా మనసుపడి .. వదలకుండ నీ వెంటపడి .. మొదలైంది నా గుండెల్లో లవ్ మెలోడీ' అంటూ ఈ పాట మొదలవుతోంది. గోపీచంద్ - డింపుల్ హయతిపై ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారు.
మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, రితేశ్ ఆలపించాడు. దినేశ్ కుమార్ కొరియోగ్రఫీని అందించాడు. జగపతిబాబు .. ఖుష్బూ .. తరుణ్ అరోరా ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా హిట్ అనే మాటకి దూరంగా ఉన్న గోపీచంద్ కి , ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి.