YS Sharmila: వైఎస్ షర్మిల కారు డ్రైవర్ అరెస్ట్... ఎందుకంటే..!

YS Sharmila car driver arrested

  • కానిస్టేబుల్ కాలి పైకి కారు ఎక్కించిన కేసులో డ్రైవర్ అరెస్ట్
  • వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు
  • డ్రైవర్ వైద్య పరీక్షల్లో షుగర్ 502

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షర్మిల కారు డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ కాలి పైకి కారు ఎక్కించిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో షుగర్ 502 వచ్చింది. కానిస్టేబుల్ గిరిబాబు కాలి పైకి కారు ఎక్కించడంతో కాలి లెగ్మెంట్ కు గాయమైంది. దీంతో డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో షర్మిలను ఏ 1గా, డ్రైవర్ బాలును ఏ2గా, మరో డ్రైవర్ జాకబ్ ను ఏ3గా నమోదు చేశారు. బాలును ముందే అరెస్ట్ చేయగా, జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతనిని అరెస్ట్ చేశారు.

కాగా, పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిల పైన ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం ఇంటి నుండి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేను బయటకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎస్సై రవీందర్ తో పాటు, మహిళా కానిస్టేబుల్ పైన చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

  • Loading...

More Telugu News