Rahul Dev Sharma: వివేకా హత్య కేసు: కడప మాజీ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నుంచి వివరాలు తీసుకున్న సీబీఐ

CBI questions IPS Rahul Dev Sharma in Viveka murder case
  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మను రెండు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ
  • గతంలో వివేకా హత్య కేసులో సిట్ వేసిన ఏపీ సర్కారు
  • సిట్ లో సభ్యుడిగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ
మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో వైఎస్సార్ కడప జిల్లాకు ఎస్పీగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మ నుంచి సీబీఐ అధికారులు నేడు వివరాలు సేకరించారు. నాడు, వివేకా హత్య జరిగిన అనంతరం నియమించిన సిట్ బృందంలో రాహుల్ దేవ్ శర్మ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సీబీఐ అధికారులను ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

రాహుల్ దేవ్ శర్మ నుంచి సీబీఐ అధికారులు ఇవాళ కీలక సమాచారం సేకరించారు. వివేకా కేసుకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని రాహుల్ దేవ్ శర్మ సీబీఐకి సమర్పించారు. వివేకా ఇంట్లో లభించిన ఆధారాలపై సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు ఈ విచారణ జరిగింది.
Rahul Dev Sharma
IPS
SP
CBI
YS Vivekananda Reddy
Kadapa District
Andhra Pradesh

More Telugu News