Foods: యవ్వనంగా కనిపించేలా చేసే ఆహార పదార్థాలు ఇవే..!

Foods That Can Make You Look Younger

  • గ్రీన్ టీ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
  • రోజులో రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు
  • అవకాడో, ఫ్యాటీ ఫిష్, డార్క్ చాక్లెట్లు, టమాటాల్లో మంచి కాంపౌండ్లు

చూడగానే యంగ్ గా కనిపించాలని అందరికీ ఉంటుంది. నిజానికి జన్యుక్రమం ఓ వ్యక్తి ఎలా కనిపించాలన్నది నిర్ణయిస్తుంది. ఇది కాకుండా మన శరీరం ఎలా కనిపించాలనే దానిని ఆహారం కూడా ప్రభావితం చేస్తుంది. సరైన ఆహారం, విశ్రాంతి లేకపోతే ముందుగా చర్మంపైనే ప్రభావం పడేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, కనీస పోషకాలతో పాటు తగినంత నీరు మన శరీరానికి అందించాలి. ఇది చేయగలిగితే మన చర్మం వయసును తగ్గించుకోవచ్చు. సరైన పోషకాహారం, తగినంత నిద్ర ఉంటే.. కంటి చుట్టూ నల్లటి వలయాలు, చర్మంపై ముడతలు ఏర్పడడం జరగదు. 

గ్రీన్ టీ
గ్రీన్ టీలో మంచి కాంపౌండ్లు ఉన్నాయి. పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పాలీ ఫెనాల్స్ కొల్లాజెన్ ను కాపాడతాయి. కొల్లాజెన్ చర్మంలో కొత్త కణాల ఉత్పత్తికి సాయపడే కాంపౌండ్. అలాగే పాలీఫెనాల్స్ అనేవి మధుమేహం, ఇన్ ఫ్లమ్మేషన్, గుండె జబ్బుల నుంచి రక్షణనిస్తాయి. శరీరంలో హానికారక ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపిస్తాయి. అయితే, రోజులో ఒకటి రెండు కప్పుల మించి గ్రీన్ టీ తాగడం మంచిది కాదు.

అవకాడోలు
ఈ పండు మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ ఫ్లమ్మేషన్ లేకుండా చేస్తుంది. ల్యూటిన్, జియాక్సాంతిన్ ఇందులో ఉంటాయి. సూర్య కిరణాల నుంచి ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే అవకాడోలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే లభిస్తాయి. ఇవన్నీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడేవే.

ఫ్యాటీ ఫిష్
ఫ్యాటీ ఫిష్ లో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి సూర్యుడి కిరణాలు, ఇన్ ఫ్లమ్మేషన్ కారణంగా చర్మం దెబ్బతినకుండా కాపాడగలవు. వీటిల్లోని ఒమెగా 3 ఫ్యాట్స్ గుండె జబ్బుల నుంచి రక్షణ నిస్తాయి. సాల్మన్ చేపల్లో ఉండే అస్టాక్సాంతిన్ అనే సహజ పిగ్మెంట్ చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది.

డార్క్ చాక్లెట్లు
పాలతో చేసినవి కాకుండా నల్లగా ఉండే డార్క్ చాక్లెట్లు చర్మానికి మంచి చేస్తాయి. ఫ్రీ రాడికల్స్, బ్యాక్టీరియా నుంచి డార్క్ చాక్లెట్లు రక్షణనిస్తాయని, చర్మంపై ముడతలను నివారిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. చర్మంలో తేమను, సాగే తత్వాన్ని డార్క్ చాక్లెట్లు కాపాడతాయి. డార్క్ చాక్లెట్లలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. చర్మానికి రక్త ప్రసరణను పెంచుతాయి. తినే డార్క్ చాక్లెట్ లో కొకొవా కనీసం 70 శాతం ఉండేలా చూసుకోవాలి.

టమాటాలు
టమాటాల్లో లైకోపీన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. చర్మంలో మృతకణాలను తొలగించలదు. దీంతో ముడతలను నివారిస్తుంది. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణనిస్తుంది. ఓ అధ్యయనంలో భాగంగా మహిళలకు 15 వారాల పాటు లైకోపీన్ ఇచ్చి చూడగా వారి చర్మంపై ముడతలు తగ్గినట్టు గుర్తించారు. టమాటాలను ఆలీవ్ ఆయిల్ తో కుక్ చేసుకుంటే లైకోపీన్ మన శరీరానికి మంచిగా పడుతుంది.

  • Loading...

More Telugu News