Anand Mahindra: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆనంద్ మహీంద్రా స్పందన
- ఏఐ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన
- మానవాళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భయాందోళనలు
- ఏఐ సృష్టించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్ జీపీటీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గత నవంబర్ లో లాంచ్ అయిన చాట్ జీపీటీ వచ్చీ రావడంతోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ఏఐతో మానవాళికి పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ ఏఐ క్రియేట్ చేసిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ చిన్నారి ఐదేళ్ల ప్రాయం నుంచి రూపాంతరం చెందుతూ 95 ఏళ్ల మహిళగా ఎలా మారుతుందో ఉంది. ఈ వీడియోను ఏఐ సాయంతో సృష్టించారని మహీంద్రా చెప్పారు. ఇలాంటి అందమైన, అద్భుతమైన వీడియోలను ఏఐ సృష్టించగలిగితే... దాని శక్తికి తాను అంతగా భయపడనని అన్నారు.