Sanjay Raut: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది: సంజయ్ రౌత్
- ఫడ్నవిస్ డిప్రెషన్ లో ఉన్నారన్న సంజయ్ రౌత్
- షిండేకు డిప్యూటీగా ఉండలేకపోతున్నారని వ్యాఖ్య
- మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం
ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కింద పని చేయడాల్సి రావడంతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ డిప్రెషన్ కు లోనవుతున్నారని ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. ముఖ్యమంత్రిగా చేసిన తనను మరొకరికి డిప్యూటీగా చేయడంతో ఫడ్నవిస్ అసహనానికి గురవుతున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో ఆయన మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల కంటే ముందే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహిస్తే... మహా వికాస్ కూటమికి 180 నుంచి 185 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఎన్సీపీలోనే ఉంటారని... బీజేపీకి బానిసగా ఆయన ఉండాలనుకోవడం లేదని చెప్పారు.