Dino Morea: 'పఠాన్' కథకు, మా 'ఏజెంట్' కథకు పోలిక లేదు: డినో మోరియా

Dino Morea explains there no similarity between Pathan and Agent
  • అఖిల్ సాక్షి వైద్య జంటగా ఏజెంట్
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రం
  • కీలకపాత్రలో డినో మోరియా
  • ద్రోహం కారణంగా వ్యవస్థకు ఎదురుతిరిగే పాత్ర
  • పఠాన్ చిత్రంలోనూ ఇలాంటి పాత్రే ఉండడంపై డినో వివరణ
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రంలో బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్ర పోషించారు. ఆయన స్పై యాక్షన్ మూవీలో రా ఏజెంట్ గా కనిపిస్తారు.

అయితే, తనకు జరిగిన ఓ ద్రోహం కారణంగా రాక్షసుడిలా మారి, వ్యవస్థకు ఎదురుతిరిగి పగ తీర్చుకునే నెగెటివ్ ఛాయలున్న పాత్ర అది.  ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంలోనూ ఇలాంటి పాత్రే ఉంది. ఆ నెగెటివ్ పాత్రను జాన్ అబ్రహాం పోషించాడు. దీనిపై డినో మోరియా వివరణ ఇచ్చారు. పఠాన్ కథకు, ఏజెంట్ కథకు పోలికే లేదని స్పష్టం చేశారు. 

పఠాన్ లోనూ, ఏజెంట్ చిత్రంలోనూ ముగ్గురు గూఢచారులకు సంబంధించిన పాయింట్ ఉండడం యాదృచ్ఛికమని, వాస్తవానికి ఏజెంట్ చిత్రం షూటింగే ముందు ప్రారంభమైదని డినో మోరియా వెల్లడించారు. కానీ కథా పరంగా చూస్తే పఠాన్ కంటే, ఏజెంట్ ఎంతో విభిన్నమైనదని, అనేక మలుపులు ఉంటాయని వివరించారు. తమ చిత్రం విలక్షణంగా ఉండడమే కాదు ఉర్రూతలూగిస్తుందని స్పష్టం చేశారు. 

అఖిల్, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మమ్ముట్టి, డినో మోరియా తదితరులు నటించారు. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత.
Dino Morea
Agent
Pathan
Akhil
Surendar Reddy
Tollywood

More Telugu News