Congress: ఆ పిచ్చితోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jaggareddy reveals why he is continuing in Congress
  • పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జగ్గారెడ్డి లేఖ
  • గాంధీ భవన్ గతంలోలా లేదని ఆవేదన
  • మనసులోని మాట చెబితే ఏమవుతుందోనని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి బుధవారం ఓ లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గతంలోలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరవైందని పేర్కొన్నారు. తన మనసులో ఎన్నో ఆవేదనలు మసులుతున్నాయని, కానీ వాటిని చెబితే ఏమవుతుంది... చెప్పకుంటే ఏమవుతుందో అనే ఆందోళన ఉందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు జగ్గారెడ్డి. ఆ కుటుంబం అంటే ఉన్న పిచ్చి కారణంగానే ఇంకా పార్టీలో కొనసాగుతున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Congress
Jagga Reddy

More Telugu News