Samantha: హైపర్ బారిక్ చికిత్స తీసుకుంటున్న సమంత
- స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అధిక పరిమాణంలో తీసుకోవడమే చికిత్స
- దీనివల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం
- ఇంకా పూర్తిగా నయం కాని మయోసైటిస్ సమస్య
ప్రముఖ నటి సమంత ఆ మధ్య మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడినట్టు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. చికిత్స కోసం కొంత కాలం పాటు ఆమె సినిమాలకు దూరమైంది. కొంత కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగులకు హాజరవుతోంది. అయితే, సమంత ఇప్పటికీ చికిత్సను కొనసాగిస్తున్నట్టు సమాచారం. వ్యాధి నుంచి ఆమె ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య కావడంతో దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం పడుతుంది.
మయోసైటిస్ వ్యాధిలో కండరాల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. శరీరమంతటా నొప్పులు ఉంటుంటాయి. దీంతో శరీంలో ఇన్ ఫ్లమ్మేషన్ పోవడానికి, ఇన్ఫెక్షన్లు తగ్గడానికి వీలుగా సమంతా ప్రస్తుతం హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ తీసుకుంటోంది. ఈ చికిత్సతో దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకుంటుంది. నిర్ణీత ప్రెజర్ తో కూడిన స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడమే హైపర్ బారిక్ చికిత్స. సాధారణ వాయు పీడనంలో మనం తీసుకునే ఆక్సిజన్ తో పోలిస్తే, ఈ చికిత్స రూపంలో ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. ఇలా అదనపు ఆక్సిజన్ అనేది బ్యాక్టీరియాపై పోరాటంలో సాయపడుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్లు, స్టెమ్ సెల్స్ విడుదలకు ప్రేరేపిస్తుంది. దాంతో సమస్య నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
‘‘సమంత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందంటూ మీడియాలో ఆర్టికల్స్ వస్తున్నాయి. అయితే, సమంత ఇప్పట్లో చనిపోవడం లేదని స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. అవును, ఇది ఆటో ఇమ్యూన్ సమస్యే. దీని నుంచి బయటపడడానికి సమయం తీసుకుంటుంది. నేనెప్పుడూ పోరాడుతూనే ఉంటాను’’ అంటూ ఆ మధ్య సమంత ప్రకటించడం తెలిసిందే.