YS Vivekananda Reddy: వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందంటే.. ఎంపీ అవినాశ్ రెడ్డి వీడియో వివరణ

Mp avinash reddy clarity about viveka murder in vedio message

  • పార్టీ కార్యక్రమం కోసం ఉదయమే జమ్మలమడుగు బయల్దేరినట్లు ఎంపీ వెల్లడి
  • శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా చనిపోయారని చెప్పారని వివరణ
  • వివేకా ఇంటికి వెళ్లేసరికే లెటర్, మొబైల్ దాచేశారన్న అవినాశ్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా మరణించిన రోజు ఏం జరిగిందనే వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. లైవ్ వీడియోలో మాట్లాడుతూ.. పలు ఆరోపణలు చేశారు. వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారన్నారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో శివప్రకాశ్ తనకు ఫోన్ చేశారని, అప్పటికే తాను జమ్మలమడుగు బయలుదేరానని వివరించారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..
‘జీకే కొండారెడ్డి అనే అతడిని వైసీపీలో చేర్చుకునే కార్యక్రమం కోసం ఆ రోజు ఉదయమే జమ్మలమడుగు బయలుదేరా.. బ్రేక్ ఫాస్ట్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. పులివెందుల రింగ్ రోడ్ దగ్గర్లో ఉండగా శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే వివేకా ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఎందుకు, ఏం జరిగిందని అడిగా. వివేకా ఇకలేరని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లాను. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఉన్నాడు. బాత్ రూంలో ఉన్న డెడ్ బాడీని చూపించాడు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపించాయా? అని అడిగితే లేదని చెప్పాడు. వాస్తవానికి నేను అక్కడికి వెళ్లక ముందే అక్కడున్న లెటర్, మొబైల్ ఫోన్ మాయమయ్యాయి. వీటి గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా కూతురు, అల్లుడికి సమాచారం ఇచ్చాడు. వివేకా అల్లుడు ఈ రెండింటినీ దాచేయాలని కృష్ణా రెడ్డికి సూచించాడు.

వివేకా రాసిన లెటర్ లో ఏముందంటే..
డ్యూటీకి తొందరగా రమ్మన్నానని నా డ్రైవర్ నన్ను చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి. 

ఈ కేసులో సందేహాలు ..
  • వివేకా సర్ చనిపోవడానికి ముందు రాసిన లెటర్ గురించి ఆయన కూతురు సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు?
  • ప్రసాద్ ను వదిలిపెట్టొద్దంటూ వివేకా సర్ లెటర్ లో సూచించడంతో జరిగింది హత్యేనని స్పష్టంగా తెలిసిపోతోంది. అయినా లెటర్ దాయాలని ఎందుకు చెప్పారు?
  • ఈ కేసులో ఎంతో కీలకమైన ఈ లెటర్ ను సీబీఐ ఎందుకు డౌన్ ప్లే చేస్తోంది? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడాలని చూస్తున్నారు?
  • సీబీఐ విచారణలో కూడా సునీత రెండు వేర్వేరు స్టేట్ మెంట్లు ఇచ్చింది. మొదటి స్టేట్ మెంట్ లో తప్పులను కవర్ చేసుకుంటూ రెండో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమెకు అధికారులు అంత సమయం ఇస్తున్నారు. ఎందుకు?
    
సీఐకి నేనేం చెప్పానంటే..
సీఐకి ఫోన్ చేసి వివేకానందరెడ్డి సార్ చనిపోయారు. మీరు తొందరగా రండి అని చెప్పాను. ఎలా చనిపోయాడని సీఐ అడిగితే.. తెలియదు సర్, కానీ బెడ్రూంలో, బాత్ రూంలో కూడా బాగా రక్తం ఉందని చెప్పాను.." అన్నారు అవినాశ్ రెడ్డి.

  • Loading...

More Telugu News