- ఏపీకి వర్షసూచన
- మే 2 వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయంటున్న ఐఎండీ
- ఐఎండీ నివేదికను వెల్లడించిన ఏపీఎస్డీఎంఏ
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో అనేక చోట్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్నిచోట్ల పిడుగులు పడి పలువురు మృత్యువాతపడ్డారు. అయితే వాన ముప్పు ఇంకా తొలగిపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నివేదిక ఆధారంగా ఏపీఎస్డీఎంఏ రాబోయే 4 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలను వెల్లడించింది.
ఏప్రిల్ 29- శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఏప్రిల్ 30- తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణ జల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
మే 1- తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సాధారణ జల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
మే 2- తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల సాధారణ జల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయి.