Pakistan: పాకిస్థాన్ లో అత్యంత ఘోరం... సమాధుల్లోని మహిళల మృతదేహాలపై అత్యాచారం

Pakistan sees necrophilia cases rise as per a media report

  • పాకిస్థాన్ లో నెక్రోఫిలియా రుగ్మత
  • శవాలపై అత్యాచారం
  • పాకిస్థాన్ లో పెరిగిపోతున్న ఘటనలు
  • డైలీ టైమ్స్ సంచలన కథనం

పాకిస్థాన్ లో మహిళల పరిస్థితి అత్యంత దారుణం అని మరోసారి వెల్లడైంది. కామాంధులు ఆఖరికి మహిళల మృతదేహాలను కూడా వదలడంలేదు. సమాధులు తవ్వి మరీ, మహిళల మృతదేహాలను వెలికి తీసి, లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు పాకిస్థాన్ లో ఎక్కువయ్యాయి. 

ఇలా సమాధులు తవ్వి, శవాలపై ఆత్యాచారాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోతుండడంతో, అమ్మాయిల తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. కామాంధులు తమ కుమార్తెల సమాధులను తవ్వి, మృతదేహాలను వెలికితీయకుండా, ఆ సమాధుల చుట్టూ ఇనుపకంచెలు, గ్రిల్స్ వంటి నిర్హాణాలతో రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. 

దీనిపై పాకిస్థాన్ మీడియా సంస్థ డైలీ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. కుమార్తెలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఇప్పుడు వారి మానాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారిందని, ఇలా సమాధుల చుట్టూ కంచెలు వేసుకోవాల్సి రావడం దేశానికే సిగ్గుచేటు అని ఈ పత్రిక పేర్కొంది. 

శవాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడాన్ని నెక్రోఫిలియా అంటారు. ఇదొక మానసిక వైపరీత్యం. పాకిస్థాన్ లో ఇది కొత్త కాదు. 2011లో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని ఉత్తర నజీమాబాద్ లో అరెస్ట్ చేయగా, సంచలన నిజాలు బయటపడ్డాయి. అతడు 48 మంది మహిళల శవాలను సమాధుల నుంచి వెలికి తీసి, వాటిపై అఘాయిత్యాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. 

రిజ్వాన్ శ్మశానంలో పనిచేసేవాడు. ఎవరైనా అమ్మాయి శవాన్ని ఖననం చేస్తే, అతడు ఆ సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికి తీసేవాడు. ఆపై తన కోరిక తీర్చుకునేవాడు. తాజాగా డైలీ టైమ్స్ కథనంతో నెక్రోఫిలియా అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

  • Loading...

More Telugu News