Rains: ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు... ఐఎండీ అలర్ట్
- మే 1, 2 తేదీల్లో పలు జిల్లాలకు వర్ష సూచన
- గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు
- ఇప్పటికే వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో బెంబేలెత్తుతున్న రైతాంగం
ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలో మే 1వ తేదీన పల్నాడు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మే 1, 2 తేదీల్లో ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మే 2వ తేదీన మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి జిల్లా, కృష్ణా, ఏలూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.