Centre: 14 మొబైల్ యాప్స్ పై నిషేధం

Centre blocks 14 mobile apps used by terrorists in Pak to send coded texts in J K
  • పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద ముఠాల ఎత్తులకు చెక్
  • ఈ యాప్ ల ద్వారా జమ్మూ కశ్మీర్లోని కేడర్ కు సమాచారం
  • దేశ భద్రత కోణంలో నిషేధిస్తూ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి కొన్ని మోసపూరిత మొబైల్ అప్లికేషన్లపై వేటు వేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల పన్నాగాన్ని కనిపెట్టేసింది. ఒక్క నిర్ణయంతో ఉగ్రవాదుల ఎత్తుగడలకు చెక్ పెట్టింది. దేశ భద్రత దృష్ట్యా 14 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అప్లికేషన్లను పాకిస్థాన్ ఉగ్రవాదులు సమాచార సాధనాలుగా ఉపయోగించుకుంటున్నట్టు తెలిసింది. ఈ అప్లికేషన్ల ద్వారా జమ్మూ కశ్మీర్ లోని అనుచరులకు సమాచారాన్ని పంపిస్తున్నట్టు గుర్తించింది. 

క్రిప్ వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, విక్ఆర్ఎంఈ, మీడియా ఫైర్, బ్రియర్, బీ చాట్, నాండ్ బాక్స్, కోనియన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి, త్రీమ నిషేధం వేట పడిన యాప్స్ లో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే క్షేత్రస్థాయి కేడర్ కు సమాచారం పంపుకునేందుకు ఈ యాప్స్ ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేంద్ర సర్కారు గతంలోనూ వందల సంఖ్యలో మొబైల్ యాప్స్ ను నిషేధించింది. దేశ భద్రతకు విఘాతం అనుకున్న ప్రతి యాప్ పై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో 250 చైనా యాప్ ల కూడా ఉన్నాయి.
Centre
blocks
mobile apps
Pakistan
terrorists

More Telugu News