Supreme Court: ఏపీలో నమోదైన రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో విచారణ
- ఏపీలో పలువురిపై రాజద్రోహం కేసులు
- ఐపీసీ సెక్షన్ 124 (ఏ) తొలగింపుపై కమిటీ నియమించిన కేంద్రం
- కమిటీ పురోగతిపై కేంద్రాన్ని ప్రశ్నించిన సీజేఐ
- చట్టాన్ని తొలగించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ లో పలువురిపై నమోదైన రాజద్రోహం కేసులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. కేంద్రం నియమించిన కమిటీ పురోగతిపై సీజేఐ ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ 124 (ఏ) తొలగింపు అంశంపై కేంద్రం కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 124 (ఏ)ను తొలగిస్తామని కేంద్రం గతంలో న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ఇవాళ్టి విచారణలో సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అందుకు కేంద్రం బదులిస్తూ, దీన్ని గత కేసులకు కూడా వర్తింపజేయాలా? వద్దా? అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ, ఆ చట్టాన్ని కేంద్రం తొలగించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం, రాజద్రోహం కేసులపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.