Polavaram Project: పోలవరంకు ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లు మాత్రమే: కేంద్రం
- పోలవరంపై వివరాలు కోరిన ఆర్టీఐ కార్యకర్త రమేశ్ చంద్రవర్మ
- రీయింబర్స్ చేయాల్సిన నిధుల వివరాలు తెలిపిన కేంద్రం
- పోలవరానికి రూ.13,463 కోట్లు రీయింబర్స్ చేశామని వెల్లడి
- 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలిన కాంపొనెంట్ కే రీయింబర్స్ చేస్తామని స్పష్టీకరణ
పోలవరం ప్రాజెక్టులో రీయింబర్స్ చేయాల్సిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం నిధులపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త రమేశ్ చంద్రవర్మ వివరాలు కోరారు. పోలవరంపై కేంద్రం చేసిన వ్యయం, రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలపై వివరాలు అడిగారు. దీనిపై కేంద్రం స్పందించింది.
2014-2023 మధ్య పోలవరానికి రూ.13,463 కోట్లు రీయింబర్స్ చేశామని కేంద్రం వెల్లడించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలిన కాంపొనెంట్ కే రీయింబర్స్ చేస్తామని స్పష్టం చేసింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ నివేదిక మేరకు కాంపొనెంట్ వ్యయం రూ.20,398 కోట్లు అని కేంద్రం వెల్లడించింది.
పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకముందు రాష్ట్రం చేసిన ఖర్చు రూ.4,730 కోట్లు అని తెలిపింది. కేంద్రం తన సాయంగా ఇవ్వాల్సింది రూ.15,667 కోట్లు అని పేర్కొంది. ఈ నేపథ్యంలో, 2023 మార్చి 31 వరకు రూ.14,418 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాగునీటి కాంపొనెంట్ కింద రూ.1,249 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలిపింది.