gangula kamalakar: గవర్నర్ రాజకీయాలు చేయకపోతే గౌరవించేవాళ్లం: మంత్రి గంగుల
- గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారన్న తెలంగాణ మంత్రి
- రాజకీయ నేతలను కేసీఆర్ కలవరని వ్యాఖ్య
- రైతులకు సాయం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్న
తెలంగాణ గవర్నర్ తమిళసై రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను కేసీఆర్, బీఆర్ఎస్ గౌరవించడం లేదన్న వ్యాఖ్యలపై గంగుల స్పందించారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్ రాజకీయ నేతలను కలవరని వ్యాఖ్యానించారు. అసలు గవర్నర్ రైతుల కోసం కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ రాజకీయాలు చేయకపోతే గౌరవించేవాళ్లమన్నారు.
రైతులకు భరోసా
అకాల వర్షాలు, వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు గంగుల భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎఫ్‌సీఐ నిబంధనల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాయంగా ఇచ్చే రూ.10వేలకు మరో రూ.10వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.