Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్, పోలీసుల కాల్పుల్లో అనిల్ దుజానా హతం

Gangster Anil Dujana killed in encounter with UP STF

  • యూపీ ఎస్టీఎఫ్ ఎన్‌కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ హతం
  • అతీక్ ఎన్ కౌంటర్ తర్వాత కొద్దిరోజులకే తాజా పరిణామం
  • అనిల్‌పై హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, భూకబ్జా ఆరోపణలు

ఉత్తరప్రదేశ్ లో గురువారం సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ అనిల్ దుజానా హతమయ్యాడు. యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియా, గ్యాంగ్ స్టర్ ల పైన ఉక్కుపాదం మోపుతోంది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు, అతీక్ తనయుడు అసద్‌లు అంతకుముందు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఘటనల అనంతరం కొన్ని రోజులకే తాజా ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం.

హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ప్రజల భూములను కబ్జా చేయడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల పేర్లతో సహా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాను యోగి ప్రభుత్వం గత నెలలో విడుదల చేసింది. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ సెగ్మెంట్ పరిధిలో అనిల్ దుజానా జాబితాలో ఉన్నారు. పశ్చిమ యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా... యూపీ ఎస్టీఎఫ్-మీరట్ యూనిట్ కలిసి జరిపిన ఎన్ కౌంటర్ లో హతమైనట్లు అదనపు డీజీపీ అమితాబ్ యాష్ తెలిపారు. అతనిపై అనేక కేసులు ఉన్నాయని, అతను కాంట్రాక్ట్ కిల్లర్ అని, అతనిపై 18 హత్య కేసులు ఉన్నాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News