Superstar: మొయిదీన్​ భాయ్​గా రజనీకాంత్​.. లాల్​ సలామ్ లో లుక్ అదుర్స్

Superstar Rajinikanth turns Moideen Bhai for daughter Aishwaryas Lal Salaam
  • కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీ అతిథి పాత్ర
  • ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం
  • నెల్సన్ దర్శకత్వం ‘జైలర్’ సినిమా చేస్తున్న సూపర్ స్టార్
వరుసగా పరాజయాలు వస్తున్నా.. వయసు మీద పడుతున్నా, సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలు ఆపడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చేస్తున్న ‘లాల్ సలామ్’. గతంలో కొచ్చాడియన్ చేసిన ఐశ్వర్య ఐదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి రజనీకాంత్ క్యారెక్టర్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘లాల్ సలామ్’లో అతను మొయిదీన్ భాయ్‌గా కనిపిస్తారు. 

ఫస్ట్ లుక్ పోస్టర్ లో రజనీ.. కళ్లజోడుపెట్టుకొని, కుర్తా ధరించి స్టయిలిష్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రంలో రజనీ చిన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో విష్ణు విశాల్‌, విక్రాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా, రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో  హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.
Superstar
Rajinikanth
Moideen Bhai
Lal Salaam
movie
Aaishwaya Rajinikanth

More Telugu News