South Group: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్, సౌత్ లాబీ పదాలు వాడకుండా నిషేధించాలంటూ సుప్రీంలో పిటిషన్

Petition files in SC seeking ban on South Group and South Lobby in Delhi Liquor Scam probe

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులుగా పలువురు దక్షిణాది వ్యక్తులు
  • సీబీఐ, ఈడీ సౌత్ గ్రూప్, సౌత్ లాబీ అనే పదాలు వాడుతున్నాయన్న పిటిషనర్
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలువురు దక్షిణాది రాష్ట్రాల వారు ఉండడంతో సౌత్ గ్రూప్, సౌత్ లాబీ అనే పదాలు విరివిగా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్, సౌత్ లాబీ అనే పదాలను సీబీఐ, ఈడీ ఉపయోగించకుండా నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

తెలంగాణ విద్యాశాఖ మంత్రి తనయుడు కార్తీక్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతినేలా ఆ పదాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా... నేరాన్ని ఒక ప్రాంతానికి ఆపాదించడం సబబు కాదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. 

దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ... పదాల నిషేధంపై దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. సౌత్ గ్రూప్, సౌత్ లాబీ అనే పదాలను వాడకుండా ఉంటేనే మంచిది అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News