KKR: రసెల్ కండబలం... కోల్ కతా విజయం

Kolkata Knight Riders won by 5 wickets against Punjab Kings with Andre Russell muscle power

  • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × పంజాబ్ కింగ్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచిన కోల్ కతా
  • 23 బంతుల్లో 42 పరుగులు చేసిన రసెల్
  • ఆఖరి బంతికి ఫోర్ కొట్టిన రింకూ సింగ్

ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసిన వేళ కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 

దూకుడుగా ఆడిన ఆండ్రీ రసెల్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో విరుచుకుపడ్డాడు. శామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ పూనకం వచ్చినట్టు ఆడాడు. ఆ ఓవర్లో రసెల్ మూడు సిక్సులు బాదాడు. దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 

ఒక్కసారిగా రన్ రేట్ తగ్గడంతో, చివరి ఓవర్లో కోల్ కతా విజయానికి 6 పరుగులు అవసరం అయ్యాయి. ఆ ఓవర్లో రసెల్ అవుట్ కాగా, చివరి బంతికి 2 పరుగులు అవసరం అయ్యాయి. ఆర్షదీప్ సింగ్ వేసిన ఆ బంతికి రింకూ సింగ్ ఫోర్ కొట్టడంతో కోల్ కతా జయభేరి మోగించింది. 180 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు ఛేదించింది. 

రింకూ సింగ్ 10 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

అంతకుముందు, కోల్ కతా ఇన్నింగ్స్ లో కెప్టెన్ నితీశ్ రాణా 51, ఓపెనర్ జాసన్ రాయ్ 31 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రాహుల్ చహర్ 2, నాథన్ ఎల్లిస్ 1, హర్ ప్రీత్ బ్రార్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి ఎగబాకడం విశేషం. పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News