Airtel: రీచార్జ్ లేకుండానే ఎయిర్ టెల్ కస్టమర్లకు అన్ లిమిటెడ్ 5జీ
- రూ.239 అంతకంటే ఎక్కువ ప్లాన్ పై ఆఫర్
- దేశవ్యాప్తంగా 3,000 పట్టణాల్లో ఎయిర్ టెల్ 5జీ సేవలు
- ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లోకి వెళ్లి ఆఫర్ క్లెయిమ్ చేసుకోవచ్చు
ఎయిర్ టెల్ తన కస్టమర్లకు అపరిమిత ఉచిత 5జీ డేటా ఆఫర్ ను అందిస్తోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ 5జీ సేవలు దేశవ్యాప్తంగా 3,000 పట్టణాలకు చేరుకున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ పట్టణాల్లోని కస్టమర్లు 4జీ ప్యాక్ పై 5జీ డేటాను పొందొచ్చని తెలిపింది. రూ.239 అంతకంటే అధిక ధరతో కూడిన ప్లాన్ ను రీచార్జ్ చేసుకునే కస్టమర్లు ఉచిత 5జీ డేటా ఆఫర్ ను పొందొచ్చు.
ఈ ఆఫర్ ను పొందాలంటే ముందుగా రూ.239 రీచార్జ్ ప్లాన్ యాక్టివ్ గా ఉందేమో చూసుకోవాలి. రీచార్జ్ చేసుకున్న అనంతరం ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లోకి వెళ్లాలి. యాప్ లేకపోతే డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ తెరిచిన తర్వాత ‘క్లెయిమ్ యువర్ అన్ లిమిటెడ్ 5జీ డేటా’అని కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఆఫర్ పేజీ తెరుచుకుంటుంది. క్లెయిమ్ నౌపై ట్యాప్ చేయాలి. దాన్ని ధ్రువీకరిస్తూ మెస్సేజ్ వస్తుంది. ఆ తర్వాత పరిమితి లేకుండా 5జీ డేటా ప్రయోజనాలను ఆనందించొచ్చు.
ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో మై అకౌంట్ లోకి వెళ్లి డేటా బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. డేటా బ్యాలన్స్ ను ట్యాప్ చేస్తే ఎంత 5జీ డేటా బ్యాలన్స్ ఉందో తెలుస్తుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా ఈ 5జీ డేటా ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న యాక్టివ్ ప్లాన్ కాల వ్యవధి వరకు 5జీ డేటా ఆఫర్ అందుబాటులో ఉంటుంది.