kunamneni sambasiva rao: మునుగోడు సహా ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి: సీపీఐ నేత కూనంనేని
- ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని ప్రశ్న
- లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యాఖ్య
- సచివాలయానికి ప్రతిపక్షాలను రానీయకపోవడంపై ఆగ్రహం
ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మంగళవారం ప్రశ్నించారు. ఈ లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి ప్రతిపక్షాలను ఎందుకు రానివ్వడం లేదో చెప్పాలని కూనంనేని నిలదీశారు. హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.