Karnataka: కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్

Bettings on Karnataka assembly election

  • హైదరాబాద్, భీమవరం, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో బెట్టింగ్
  • బీజేపీ, కాంగ్రెస్ గెలుపుపై బెట్టింగ్ జోరు
  • చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు

కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. రేపు పోలింగ్ జరగనుండగా, 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోపక్క, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ గెలుపుపై హైదరాబాద్, కొంపల్లి, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, భీమవరం తదితర ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 114 నుండి 116 సీట్లు, బీజేపీకి 80 నుండి 82 సీట్లు వస్తాయని బెట్టింగులు కాస్తున్నారు. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావొచ్చునని బెట్టింగులు కడుతున్నారు. జేడీఎస్ కు 21 సీట్ల నుండి 23 సీట్ల వరకు వస్తాయని మొదటి నుండి బెట్టింగు కడుతున్నారు. రేపు పోలింగ్ సరళిని బట్టి కూడా బెట్టింగ్ మారవచ్చు.

  • Loading...

More Telugu News