Shahid Kapoor: మరో భారీ ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే!

Pooja Hegde Special
  • వరుస ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే
  • అయినా ఎంతమాత్రం తగ్గని అవకాశాలు 
  • మరోసారి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్
  • ఆల్రెడీ షూటింగు దశలో ఉన్న మహేశ్ మూవీ  
పూజ హెగ్డే ఇటు సౌత్ లోను .. అటు నార్త్ లోను తన జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగినట్టుగానే ఆమె ప్రయత్నాలు ఉన్నాయి .. అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు .. తమిళ ... హిందీ భాషల్లో పూజ హెగ్డేకి హిట్ పడలేదు. ఇది ఆమె అభిమానులను చాలా నిరాశపరిచిన విషయం. 

ప్రభాస్ తో చేసిన 'రాధే శ్యామ్' ..  చరణ్ తో చేసిన 'ఆచార్య' .. విజయ్ తో చేసిన 'బీస్ట్' పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ షాక్ నుంచి ఈ బ్యూటీ కోలుకోవడం కష్టమేనని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె లైట్ గానే తీసుకుందనే విషయం వారికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ ఆమెకి సల్మాన్ జోడీగా ఛాన్స్ దక్కింది. అయితే ఆ సినిమా కూడా భారీ ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. ఇక ఆమె చేతిలో మహేశ్ మూవీ ఒక్కటే ఉందని అనుకుంటూ ఉండగా, బాలీవుడ్ లో షాహిద్ కపూర్ జోడీగా ఆమెకి ఛాన్స్ తగిలినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రుస్ ఈ  సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. 

Shahid Kapoor
Pooja Hegde
Roshan

More Telugu News