Andhra Pradesh: ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
- నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
- ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
- విద్యార్హతలతో పాటు ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరి
స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న 14 మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ (లా ఇన్ బిజినెస్/ కమర్షియల్ లాస్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలని పేర్కొంది. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీనాటికి 21 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపింది.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ నెల 15 లోపు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.590 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం, జీతభత్యాలు..
అభ్యర్థులను ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మేనేజర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.1,01,970 నుంచి రూ.1,74,790 వరకు, డిప్యూటీ మేనేజర్ కు రూ.76,730 నుంచి రూ.1,62,780 వరకు, అసిస్టెంట్ మేనేజర్ కు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ లింక్ కోసం..